Bhale Dongalu Overview

Starcast: Tarun, Ileana

Director: Vijaya Bhaskar

Bhale Dongalu Stills

Bhale Dongalu Event Photos

Bhale Dongalu Event Videos

Bhale Dongalu Reviews

yagna murthy reviews Bhale Dongalu - 3 mnths ago

Next Bhale Dongalu Movie Review (2 Reviews)
‘భలే దొంగలు’ పర్వాలేదనిపించారు!
దొంగల సినిమా అంటే కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్. రెగ్యులర్ కామెడీ హీరోలు చేసే సినిమాలు ఒక రకం. అదే.. ప్రేక్షకుల్లో క్రేజీ ఇమేజ్ వున్న అందాల తార ఇలియానా, ఒకప్పుడు 'నువ్వే కావాలి' వంటి సినిమాతో గ్రాండ్‌గా హీరో అయిన తరుణ్ కలిసి అలాంటి దొంగలుగా నటిస్తే.. అదింకా ఆసక్తిని రేకెత్తిస్తుంది. 'భలే దొంగలు' సరిగ్గా అలాంటి ఆసక్తికర చిత్రమే. అయితే దీన్ని రీమేక్ అనాలా, ఫ్రీమేక్ అనాలా? 'భలే దొంగలు'కి తనే కథ సమకూర్చానని దర్శకుడు విజయభాస్కర్ టైటిల్స్‌లో ప్రకటించుకున్నాడు. కానీ కొన్ని పాత్రలు కలిపినంత మాత్రాన, కొన్ని సన్నివేశాలు మార్చినంత మాత్రాన బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'బంటీ ఔర్ బబ్లీ' ప్రధాన కథ తనదై పోతుందా? 'భలే దొంగలు' నిస్సందేహంగా 'బంటీ ఔర్ బబ్లీ' కథేనని మెడకాయ మీద తలకాయ వున్నవాడెవడైనా చెబుతాడు. అలాంటప్పుడు ఆ కథ తనదేనని బుకాయించడం సబబేనా? ఆ సంగతలా వుంచితే ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరుణ్, ఇలియానా జోడీ 'భలే దొంగలు'గా రాణించారా?
à°•à°¥:
తండ్రి ఉద్యోగంలో చేరమన్నందుకు అలిగి రాము (తరుణ్), ఇంట్లోవాళ్లు తనకి వద్దంటున్నా పెళ్లి చేయాలనుకుంటున్నందుకు కోపంతో జ్యోతి (ఇలియానా) పెద్దలకి చెప్పా పెట్టకుండా ఒక రాత్రివేళ ఒకే రైలెక్కుతారు. ఒకే బోగీలో తారస పడతారు. తెల్లారేసరికి ఇద్దరి బ్యాగులూ మాయమవుతాయి. విశాఖపట్నం వెళతారు. అక్కడ జరిగే మిస్ ఇండియా సెలెక్షన్స్‌లో పాల్గొనాలనేది జ్యోతి ఆశయం. కానీ అక్కడామెకు ప్రవేశం లభించకపోగా అవమానం ఎదురవుతుంది. అడుగడుగునా వారికి మోసగాళ్లు ఎదురవుతారు. దాంతో తాము కూడా అలాగే మారాలనుకుంటారు రాము, జ్యోతి. కలిసి మోసాలు, దొంగతనాలు చేయడం మొదలు పెడతారు. హైదరాబాద్‌కు వచ్చి 'బంటీ ఔర్ బబ్లీ' మాదిరిగా 'రోమియో అండ్ జూలియెట్' అవతారాలెత్తుతారు. కరడుగట్టిన డ్రగ్స్ వ్యాపారి, స్మగ్లర్ అయిన వీర్రాజు (ప్రదీప్ రావత్)ను సైతం మోసంచేసి, అతని ఆగ్రహానికి గురవుతారు. రోమియో జూలియట్‌ల వల్ల మోసపోయినవాళ్లు ఇచ్చే ఫిర్యాదులు ఎక్కువైపోతాయి. వారిని పట్టుకోవడానికి డిసిపి యుగంధర్ (జగపతిబాబు) నడుం బిగిస్తాడు. ఓవైపు అతను, మరోవైపు వీర్రాజు మనుషులు తరుముతుంటే రోమియో జూలియెట్‌లు ఏం చేశారు? వారు ఎవరి చేతికైనా చిక్కారా? పరస్పరం ఆకర్షితులైన వారి జీవితాలు చివరికేమయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.
కథనం:
ఈ కథ చదివాక ఇది 'బంటీ ఔర్ బబ్లీ' కాదని ఎవరైనా అనగలరా? కాకపోతే హిందీలో లేని విలన్ వీర్రాజు తెలుగులో దర్శనమిస్తాడు. హీరో హీరోయిన్లు, పోలీసాఫీసర్ పాత్రలు సరిగ్గా అవే.
మిగతా రివ్యూ కోసం చిత్రమాల డాట్ కామ్ చూడండి.






© 1998-2008 Copyright Sulekha.com Connecting Indians Worldwide, All Rights Reserved.